Share News

450 ఏళ్ల మ్యాప్‌నకు యూఎన్ మార్పులు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత్.. కానీ

ABN , Publish Date - Sep 06 , 2026 | 01:26 PM

నాలుగు శతాబ్దాలకు పైగా వినియోగంలో ఉన్న ప్రపంచ మ్యాప్‌కు మార్పులు చేసే తీర్మానానికి ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. అయితే, సరిహద్దుల విషయంలో తమ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని భారత్ స్పష్టం చేసింది.

450 ఏళ్ల మ్యాప్‌నకు యూఎన్ మార్పులు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత్.. కానీ
Equal Area Projection

ఇంటర్నెట్ డెస్క్: నాలుగు శతాబ్దాలకు పైగా వినియోగంలో ఉన్న ప్రపంచ మ్యాప్‌నకు మార్పులు చేసే తీర్మానానికి ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. భారత్‌ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. యూఎన్ తీర్మానాన్ని ఆమోదించినప్పటికీ తాము ఏ ఒక్క పొలిటికల్ మ్యాప్‌నకు, అంతర్జాతీయ సరిహద్దుకు ప్రత్యేకంగా మద్దతు తెలపడ్లేదని స్పష్టం చేసింది. ఇక, కొత్త మ్యాపులో భారత దేశ సరిహద్దులు (జమ్మూకశ్మీర్ సహా) తమ అధికారిక మ్యాప్‌నకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది.


ఏమిటీ మ్యాపు సవరణ

ప్రస్తుతం వినియోగిస్తున్న మ్యాప్‌ను (మర్కెటర్ ప్రొజెక్షన్ మ్యాప్) నాలుగు శతాబ్దాల క్రితం అప్పటి నౌకాయానానికి అనుకూలంగా రూపొందించుకున్నారు. ఫలితంగా ధ్రువాల సమీపంలోని భూభాగాలు పెద్దవిగా, భూమధ్య రేఖకకు సమీపంలోని భూభాగాలు చిన్నవిగా మ్యాపుల్లో చిత్రీకరించారని నిపుణులు చెబుతున్నారు. దీంతో, దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల పరిమాణాలు ఐరోపా దేశాలతో పోల్చి చూసినప్పుడు వాస్తవ పరిస్థితికంటే మ్యాపుల్లో చిన్నవిగా మారాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈక్వల్ ఏరియా మ్యాప్ ప్రొజెక్షన్ మ్యాప్ కోసం ఆఫ్రికా దేశాలు కొంతకాలంగా పట్టుబడుతున్నాయి. తాజాగా ఈ తీర్మానికి ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఓటింగ్‌లో 164 దేశాలు అనుకూల ఓటు వేయగా అమెరికా మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేసింది. ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఆ నౌకను జలసమాధి చేసేశాం.. షాకింగ్ వీడియోను షేర్ చేసిన యూఎస్

విమానంలో అలజడి సృష్టించిన వృద్ధుడు.. ప్లాస్టర్‌తో సీటుకు కట్టేసిన సిబ్బంది..

Updated Date - Sep 06 , 2026 | 02:01 PM