విమానంలో అలజడి సృష్టించిన వృద్ధుడు.. ప్లాస్టర్‌తో సీటుకు కట్టేసిన సిబ్బంది..
ABN , Publish Date - Sep 06 , 2026 | 10:10 AM
ఓ వృద్ధుడు విమానంలో అలజడి సృష్టించాడు. విమాన సిబ్బందిపై గట్టిగట్టిగా అరవటమే కాకుండా.. తోటి ప్రయాణికులపై దాడికి దిగాడు. దీంతో విమాన సిబ్బంది అతడిని కట్టడి చేసేందుకు సీటుకు ప్లాస్టర్‌తో కట్టేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ వృద్ధుడు విమానంలో అలజడి సృష్టించాడు. విమాన సిబ్బందిపై గట్టిగట్టిగా అరవటమే కాకుండా.. తోటి ప్రయాణికులపై దాడికి దిగాడు. దీంతో విమాన సిబ్బంది అతడిని కట్టడి చేసేందుకు సీటుకు ప్లాస్టర్‌తో కట్టేశారు. విమానాన్ని మధ్యలోనే ఆపి అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన అమెరికాలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం గురువారం డల్లాస్ ఫోర్ట్ వర్త్ నుంచి నెవార్క్ బయలు దేరింది.
రెండు గంటల ప్రయాణం తర్వాత ఓ వృద్ధుడు విమానంలో వీరంగం సృష్టించాడు. గట్టిగా కేకలు పెడుతూ.. తన పక్కన కూర్చున్న వ్యక్తి గొంతును బలంగా నొక్కటం మొదలెట్టాడు. బాధితుడు గట్టిగా అరవటంతో పక్కన ఉన్న వాళ్లు అలర్ట్ అయ్యారు. మెయిజా, ఒలెనిక్ అనే ఇద్దరు వ్యక్తులు వెంటనే వృద్ధుడిని అడ్డుకున్నారు. బలవంతంగా అతడిని పక్కకు లాక్కువచ్చారు. ఆ వృద్ధుడు గట్టిగట్టిగా అరుస్తూ.. వారిపై కూడా దాడి చేయడం మొదలెట్టాడు. విమాన సిబ్బంది సాయంతో వారు అతడిని సీటుకు కట్టేశారు.
ఈ అనుకోని సంఘటన కారణంగా విమానం బాల్తిమోర్‌లో ఆగాల్సి వచ్చింది. విమాన సిబ్బంది ఆ వృద్ధుడిని లోకల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టీమ్‌కు అప్పగించారు. ఆ తర్వాత విమానం నెవార్క్ వెళ్లిపోయింది. ఈ సంఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. విమాన సిబ్బంది సకాలంలో స్పందించటం వల్ల పెను ప్రమాదం తప్పిందని పేర్కొంది. విమానాల్లో తప్పుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
గుండెపోటుతో జార్ఖండ్ మంత్రి కన్నుమూత