నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూమిపై వైసీపీ భూ కబ్జాదారుల కన్ను
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:14 AM
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. చుంచులూరు గ్రామంలో ప్రభుత్వానికి చెందిన పశువుల కుంట స్థలాన్ని వైసీపీ భూ కబ్జాదారులు ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లా, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. చుంచులూరు గ్రామంలో ప్రభుత్వానికి చెందిన పశువుల కుంట స్థలాన్ని వైసీపీ భూ కబ్జాదారులు ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చుంచులూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ -205లో సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ పశువుల కుంట స్థలం ఉంది. ఇటీవల ఈ భూమిలో ఉన్న చెట్లను తొలగించి వైసీపీ భూ కబ్జాదారులు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమిని వ్యక్తిగత ఆస్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వారు అంటున్నారు. ఈ వ్యవహారంలో దుత్తలూరు మండలానికి చెందిన కార్లగుట సురేశ్‌రెడ్డి, కేతా ప్రసాద్ రెడ్డి అనే వైైసీపీ నేతల పేర్లతో నకిలీ పట్టాలు సృష్టించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి కోసం దొంగపత్రాలు తయారు చేసినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూమిలో చెట్ల తొలగింపు, ఆక్రమణ ప్రయత్నాలపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని, దీనిపై అధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News