పంచాయతీ ఎన్నికల వేళ.. వైసీపీకి బిగ్ షాక్
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:17 PM
రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ, మలి దశ స్థానిక సంస్థలు జరుగుతున్న వేళ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.
నెల్లూరు, నవంబర్ 26: రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ, మలి దశ స్థానిక సంస్థలు జరుగుతున్న వేళ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత మండలం పొదలకూరులో ఆయన ముఖ్య అనుచరులు ఊకోటి లక్ష్మీనారాయణ, సన్నికంటి శ్రీనివాసులతోపాటు 150 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి. వారందిరికీ సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. టీడీపీ పట్ల ఆకర్షితులవుతున్నారని సోమిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరో వైపు 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీని వీడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అగ్రనాయకుల నుంచి కేడర్ వరకు ఇప్పటికే ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
రాత్రి.. లేటుగా నిద్రపోతున్నారా..? అయితే ఈ అవయవాలపై ఎఫెక్ట్ పడ్డట్లే..
సోము వీర్రాజు ఆగ్రహం.. తొడగొట్టి హెచ్చరిక
Read Latest AP News And Telugu News