పేదరిక నిర్మూలనకు డబ్బు మాత్రమే సరిపోదు: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:05 PM
‘పేదరిక నిర్మూలనకు డబ్బు మాత్రమే సరిపోదు. సరైన మార్గదర్శకత్వంతోనే నిరుపేదల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. పీ4 పథకం ద్వారా దీన్ని నిరూపించాం..’ అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 పథకం విజయవంతమైందని మంత్రి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు
ఈ పథకం ద్వారా కుప్పం సాధించిన విజయగాథను లోకేశ్ వెల్లడించారు. ఇటుక ఫ్యాక్టరీలో కార్మికురాలుగా పనిచేసే కుప్పానికి చెందిన ఓ మహిళ నేడు ఇటుక ఫ్యాక్టరీకి యజమాని అయిందని ఆయన వెల్లడించారు. కేవలం రూ.60 వేల పెట్టుబడితో ప్రారంభించి.. ఏడాదిలోనే 20 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఆమె ఎదిగారని లోకేశ్ కొనియాడారు. పరిశ్రమలు-ప్రభుత్వం-ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రజల జీవితాల్లో ఈ మార్పు సాధ్యమైందని మంత్రి తెలిపారు.
పరిశ్రమలు-ప్రభుత్వం-ప్రజల భాగస్వామ్యం(పీ4)పథకం సహాయంతో రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. పాఠశాలల దత్తత కార్యక్రమంలో కంపెనీల భాగస్వామ్యం పెరుగుతోందని ఆయన తెలిపారు. ఈ మేరకు విద్యార్థి దశ నుంచే వారికి జీవన నైపుణ్యాలను బోధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనితోపాటు.. కుటుంబ బడ్జెట్, వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ.. విద్యార్థులకు తగిన శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
భారీ వర్షాల వేళ విజయవాడ కొండ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి: మంత్రి నారాయణ
తుఫాన్ వేళ ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News