విద్యార్థుల్లో ఒత్తిడి నివారణకు అవగాహన కార్యక్రమాలు: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Sep 23 , 2026 | 09:28 PM
విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని పోగొట్టేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అమరావతి, సెప్టెంబర్ 23: విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని పోగొట్టేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఏడాది ‘మిషన్ మార్చ్’ విధానం ద్వారా పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని 963 పాఠశాలల్లో విద్యార్థులకు యోగా శిక్షణను ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి దశ నుంచే యోగా చేయడం ద్వారా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. వారిలో భయాన్ని, ఆందోళనను తగ్గించేందుకు యోగా సహాయపడుతుందని మంత్రి అన్నారు. దానితోపాటు.. యోగా వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని లోకేశ్ తెలిపారు.
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు