ఉచిత దర్శన మార్గంలో శ్రీవారిని దర్శించుకున్న ఆ జిల్లా కలెక్టర్..
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:18 PM
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
నంద్యాల జిల్లా: శ్రీశైలం(Srisailam) భ్రమరాంబికా మల్లికార్జునస్వామి మహా శివరాత్రి(Maha Shivratri) బ్రహ్మోత్సవాలకు భక్తులు(devotees) అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం నాడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.. ఉచిత క్యూ లైన్లో సాధారణ భక్తులతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఈ దర్శనానికి 20 నిమిషాల సమయం పట్టింది.
అనంతరం భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, ఉచిత దర్శన క్యూ లైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, శానిటేషన్, వైద్య సదుపాయాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని భక్తులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ రాజకుమారి. ఇదిలా ఉంటే.. ప్రత్యేక దర్శనాల కంటే సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఉచిత క్యూ లైన్ ద్వారా తక్షణ దర్శనం కల్పించారు దేవస్థాన అధికారులు. భక్తులు నియమ నిబంధనలు పాటిస్తూ స్వామీ అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని రాజకుమారి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు
నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు