ఏపీలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి : మంత్రి లోకేశ్
ABN , Publish Date - Oct 19 , 2026 | 09:18 PM
నంద్యాల జిల్లా పెట్నికోటలో రూ.2,650 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,650 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోందని, పెట్టుబడులకు రాష్ట్రం అత్యంత అనుకూల వేదికగా మారుతోందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నంద్యాల జిల్లా పెట్నికోటలో రూ.2,650 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేసిన అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ ప్రారంభమైనట్లు ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి కేవలం 14 నెలల వ్యవధిలోనే ప్లాంట్‌ను పూర్తి చేయడం ప్రభుత్వ పాలనా దక్షతకు, అభివృద్ధి వేగానికి నిదర్శనమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,650 మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఈ సిమెంట్ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఎలాంటి భూగర్భ జలాలను వినియోగించకుండా పూర్తిగా పర్యావరణ హితంగా దీన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, వందశాతం గ్రీన్ ఎనర్జీ (హరిత శక్తి)తో నడిచేలా ఈ ప్లాంట్‌ను తీర్చిదిద్దడం విశేషం. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూనే పారిశ్రామిక వృద్ధిని సాధిస్తున్నామనడానికి ఈ ప్రాజెక్ట్ ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని పారిశ్రామిక వర్గాలు కొనియాడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
షమీని జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చింది: రవి శాస్త్రి
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఓజా.. ప్యానెల్‌లో రమేశ్ పొవార్‌కు చోటు
ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ఎఫెక్ట్.. ఆ కామెంటేటర్లపై పాక్ బోర్డు వేటు!