Share News

బస్సుల సీటింగ్ సమస్య.. లవర్ కోసం ఎంత పనిచేశాడంటే..

ABN , Publish Date - Feb 17 , 2026 | 09:56 PM

లవర్ కోసం ప్రైవేట్ ట్రావెల్ బస్ సిబ్బందిపై ఓ యువకుడు దాడి చేశాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బస్సుల సీటింగ్ సమస్య.. లవర్ కోసం ఎంత పనిచేశాడంటే..
Machilipatnam Bus Attack

కృష్ణా, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): లవర్ కోసం ప్రైవేట్ ట్రావెల్ బస్ సిబ్బందిపై ఓ యువకుడు దాడి చేశాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి ప్రయాణించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీటును ఇద్దరు ప్రేమికులు బుక్ చేసుకున్నారు. అయితే సీట్లను బుక్ చేసుకునే సమయంలో వీరు యువతుల పేరుతో రెండు సీట్లను బుక్ చేసుకున్నారు.


యువతుల పేరుతో బుక్ చేసుకున్న సీట్లలో సదరు యువకుడిని ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్ అనుమతించలేదు. బస్ సిబ్బందితో వాగ్వాదానికి యువకుడు దిగాడు. ఈ క్రమంలో మచిలీపట్నం బస్టాండ్ సెంటర్‌లో ప్రేమికులు దిగారు. ఇద్దరినీ పక్క పక్కన కూర్చోనివ్వని డ్రైవర్‌ను వదలొద్దని యువతి చెప్పడంతో రెచ్చిపోయి యువకుడు చిలకలపూడి సెంటర్‌లో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అవటంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 10:03 PM