Share News

విజయవాడలో టీడీపీ జెండా దిమ్మె కూల్చివేత ఘటన.. వైసీపీ నేత అరెస్ట్

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:19 PM

విజయవాడలోని కానూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ స్థానిక నాయకుడు దేవభక్తుని చక్రవర్తి, అతని అనుచరులు కూల్చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

విజయవాడలో టీడీపీ జెండా దిమ్మె కూల్చివేత ఘటన.. వైసీపీ నేత అరెస్ట్
TDP Flag Pole Demolition

విజయవాడ, జూన్ 25: కానూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ స్థానిక నాయకుడు దేవభక్తుని చక్రవర్తి, అతని అనుచరులు కూల్చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్కడకు చేరుకుని వైసీపీ నేతల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే.. ధ్వంసం చేసిన టీడీపీ జెండాను వెంటనే నిర్మాణం చేశారు.


గ్రామంలో ఘర్షణ వాతావరణం సృష్టించారంటూ దేవభక్తుని చక్రవర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దేవభక్తుని చక్రవర్తి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జై జగన్ అంటూ నినాదాలతో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు జులుం ప్రదర్శించారు. దీంతో అదనపు బలగాలను రంగంలోకి దించిన పోలీసులు.. నిరసనకు దిగిన కార్యకర్తలను పక్కకు లాగేశారు. దేవభక్తుని చక్రవర్తిని అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు.


టీడీపీ శ్రేణుల ఆగ్రహం..

టీడీపీ జెండా దిమ్మెను కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీ శ్రేణులు.. స్థానిక వైసీపీ నేత దేవభక్తుని చక్రవర్తి నివాసం వైపుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసు అదనపు బలగాలు రంగంలోకి దిగి.. ఆ మార్గంలో ఎవరూ వెళ్లకుండా అడ్టుకున్నారు. సంయమనం‌ పాటించాలని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోకుంటే అప్పుడు చూద్దామంటూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పి వారిని వెనక్కి తీసుకెళ్లారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 ఏళ్లు అయింది: బాలకృష్ణ

దేవినేని నెహ్రూ లేకపోతే నువ్వు ఆఫ్ట్రాల్.. అవినాష్‌పై పట్టాభి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 05:03 PM