Share News

Yanamala Ramakrishnudu: జగన్ బెంగళూరు మకాంపై యనమల సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 10 , 2026 | 01:00 PM

నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే జగన్ అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని యనమల విమర్శించారు. బెంగళూరులోనే జగన్ మకాం వేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయని తెలిపారు.

Yanamala Ramakrishnudu: జగన్ బెంగళూరు మకాంపై యనమల సంచలన వ్యాఖ్యలు
Yanamala Ramakrishnudu

అమరావతి, జనవరి 10: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) బెంగళూరు మకాంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (TDP Leader Yanamala Ramakrishnudu) సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో కుట్రల అమలుకు బెంగళూరులో బ్యాక్ ఆఫీస్ పెట్టారంటూ జగన్‌పై ఆరోపణలు గుప్పించారు. అవినీతి కార్యకలాపాలకు బెంగళూరు ప్యాలెస్‌నే కేంద్రంగా చేసుకున్నారంటూ జగన్‌పై ఆరోపణలు చేశారు. బెంగళూరులోనే జగన్ మకాం వేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. తన అవినీతి సంపదను జగన్ బెంగళూరు ప్యాలెస్‌కు తరలించారంటూ యనమల వ్యాఖ్యలు చేశారు.


బెంగళూరు జగన్ జన్మస్థలం కాదని.. సొంత నియోజకవర్గం కానే కాదని తెలిపారు. జగన్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా కాదన్నారు. కనీసం హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం కాదని... అలాంటప్పుడు జగన్ బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో ఎందుకు మకాం వేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ బెంగళూరు కేంద్రంగానే అనేక కుట్రలకు తెర లేపారని సంచలన ఆరోపణలు చేశారు. నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని యనమల విమర్శించారు.


అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా అవినీతి కార్యకలాపాలకు పాల్పడడం వల్లే జగన్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని టీడీపీ సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీఆర్ తాజా రిపోర్ట్ ప్రకారం జగన్ సహా వైసీపీ కీలక నేతల ఆస్తులు ఉన్నట్టుండి 600 శాతం మేర పెరిగాయన్నారు. అవినీతి కారణంగానే ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు. జగన్, వైసీపీ నేతలు నియో రిచ్ క్లబ్ నుంచి వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్‌లో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల కాలంలో పోగేసిన అవినీతి సంపదతోనే జగన్ సహా మిగిలిన కీలక నేతల ఆస్తులు 600 శాతం మేర పెరిగాయని అన్నారు. బడుగులను అణగదొక్కుతూ.. ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వంటివి జగన్ అవినీతి పుత్రికలే అంటూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్

ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 01:42 PM