విజయవాడలో నేటి నుంచి జాతీయ సరస్ మేళా పునఃప్రారంభం: కలెక్టర్ లక్ష్మీశా
ABN , Publish Date - Oct 29 , 2026 | 09:55 AM
తుఫాన్ కారణంగా ఈనెల 28న తాత్కాలికంగా మూసివేసిన జాతీయ సరస్ మేళా ఈరోజు నుంచి పునః ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు.
విజయవాడ, అక్టోబర్ 29: తుఫాన్ కారణంగా ఈనెల 28న తాత్కాలికంగా మూసివేసిన జాతీయ సరస్ మేళా ఈరోజు నుంచి పునః ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. పున్నమిఘాట్ సరస్ ప్రాంగణంలో ఈనెల 31వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుందన్నారు. వివిధ రాష్ట్రాల మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల కొనుగోలుకు అవకాశం ఉందని చెప్పారు.
సంప్రదాయ హస్తకళలు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు, ప్రాంతీయ ప్రత్యేక ఆహార పదార్థాలు సరస్ మేళాలో ప్రధాన ఆకర్షణగా నిలిచినట్లు కలెక్టర్ తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ, వారి ఆర్థిక స్వావలంబనకు జాతీయ సరస్ మేళాను నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి మేళాను సందర్శించి, మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించాలని కలెక్టర్ లక్ష్మీశా కోరారు.
విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఈనెల 15 నుంచి జాతీయ సరస్ మేళా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేళాను ప్రారంభించారు. సరస్ మేళాలో దాదాపు 650 స్టాల్స్‌లో హస్తకళలు, చేతి వృత్తులు, ఇతర కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి డ్వాక్రా మహిళలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈనెల 15 నుంచి 31 వరకు 14 రోజుల పాటు సరస్ మేళా జరగనుంది. అయితే తుఫాన్ కారణంగా ఈనెల 28 నుంచి సరస్ మేళాను తాత్కాలికంగా మూసివేయగా.. ఈరోజు నుంచి తిరిగి ప్రారంభంకానుంది.
ఇవి కూడా చదవండి...
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి పర్యటన.. విద్యుత్ పునరుద్ధరణకు ఆదేశాలు
ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో రైళ్లు దారి మళ్లింపు, పలు సర్వీసుల రద్దు
Read Latest AP News And Telugu News