Share News

3,08,791 హెక్టార్లలో పంట నష్టం

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:39 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ రాష్ట్రంలో 16 జిల్లాల్లోని 249 మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. కోస్తాంధ్రలో 2,747 గ్రామాలకు చెందిన 4,62,923 మంది రైతులు తుఫాన్‌ ప్రభావానికి గురయ్యారు.

3,08,791 హెక్టార్లలో పంట నష్టం

రైతుల స్వీయ నమోదుకు అవకాశం

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ రాష్ట్రంలో 16 జిల్లాల్లోని 249 మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. కోస్తాంధ్రలో 2,747 గ్రామాలకు చెందిన 4,62,923 మంది రైతులు తుఫాన్‌ ప్రభావానికి గురయ్యారు. వరి 3,03,978, మొక్కజొన్న 273, మినుము 3,385, పత్తి 1,036 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇతర పంటలతో కలిపి మొత్తం 3,08,791 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. తుఫాన్‌ పంట నష్టాన్ని కర్షక్‌ పోర్టల్‌లో రైతులే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ బుధవారం తెలిపారు. పోర్టల్‌ పేజీ తెరిచి, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, రైతు ఆధార్‌ నంబరుతో వివరాలు నమోదు చేయడం, సర్వే నంబరు, నష్టపోయిన విస్తీర్ణం నమోదు చేసి, పంట ఫొటో అప్‌లోడ్‌ చేసి, ఓటీపీతో స్వీయ నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 06:39 AM