గురువులపై దాడి ఘటన.. ఏపీ ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:16 PM
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్ కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. దాడి చేసిన వారిని గుర్తించి ఎవరినీ వదిలి పెట్టవద్దని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది.
అమరావతి, సెప్టెంబర్ 21: విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్ కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. దాడి చేసిన వారిని గుర్తించి ఎవరినీ వదిలి పెట్టవద్దని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది. దాడి ఘటనలో పాల్గొన్న వైసీపీ నేతలు, రౌడీ షీటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ, వీడియో ఫుటేజ్‌లను పరిశీలించి దాడిలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. దాడిలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఉన్నతాధికారులు ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూంలో వీడియో ఫుటేజ్‌ను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ దాడికి సంబంధించి మొత్తం మూడు లేదా నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మూకుమ్మడి దాడులు, నిబంధనల ఉల్లంఘన, పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయనున్నారు. మాచవరం, సూర్యారావుపేట, కృష్ణలంక పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసుల నమోదు చేయాలని ఆదేశించింది. ర్యాలీ, ఘర్షణల్లో పాల్గొన్నట్లు గుర్తించిన రౌడీషీటర్లను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి నగరాల నుంచి కొంతమంది రౌడీషీటర్లు ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది రౌడీషీటర్లను పోలీసు అధికారులు గుర్తించినట్లు సమాచారం. వైసీపీ గ్యాంగ్‌లు కర్రలు, రాడ్లు, కోడిగుడ్లు, రాళ్లు తీసుకురావడం వెనుక పక్కా ప్లాన్ ఉందని పోలీస్ అధికారులు చెబుతున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి...
నా పాలనలో ఏ డీఎస్సీలోనూ అవకతవకలు జరగలేదు: సీఎం చంద్రబాబు
టీచర్లపై వైసీపీ దాడి.. వదిలే ప్రసక్తే లేదంటూ మంత్రి లోకేశ్ వార్నింగ్
Read Latest AP News And Telugu News