ఏబీఎన్ కథనంతో కదిలిన అధికార యంత్రాంగం.. ఎంజీఎంకు కలెక్టర్
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:36 PM
వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో స్లాబ్ పెచ్చులూడిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈరోజు కలెక్టర్ సత్యశారద, డీఎంఈ వాణి ఎంజీఎంకు చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు.
వరంగల్, సెప్టెంబర్ 21: జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో స్లాబ్ పెచ్చులూడిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఎంజీఎంలో దుస్థితిపై ఆ కథనాల్లో వివరించడంతో వెంటనే అధికార యంత్రాంగం స్పందించింది. ఈరోజు(సోమవారం) కలెక్టర్ సత్యశారద, డీఎంఈ వాణి ఎంజీఎంకు చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పెచ్చులూడిన భవనాలను సందర్శించారు. మరోవైపు ఎంజీఎం వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. డీఎంఈ, కలెక్టర్ ఎదుటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవి, బీజేపీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాగా.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్లాబ్ పెచ్చులూడటంతో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. నిన్న(ఆదివారం) ఆరోగ్య శ్రీ వార్డులో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులూడి కిందపడ్డాయి. ఈ ఘటనలో ఆ వార్డులో చికిత్స పొందుతున్న వారితో పాటు వారిని పరామర్శించడానికి వచ్చిన వారికీ గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది.. గాయపడిన వారిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందజేశారు. అయితే ఆస్పత్రిలో ఇలా పెచ్చులూడటంపై రోగులు, బంధువులు భయాందోళనకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి...
ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిది: కేటీఆర్
దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై బుధవారం సుప్రీంలో విచారణ
Read Latest Telangana News And Telugu News