Share News

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు..

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:35 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించిన అధికారులు.. ఆయనను రెండు రోజుల పాటు విచారించనున్నారు.

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు..
Karumuri Nageswara Rao

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించిన అధికారులు.. ఆయనను రెండు రోజుల పాటు విచారించనున్నారు. ఏపీఎస్బీసీఎల్ లిక్కర్ రవాణా టెండర్ల కేసు విచారణలో భాగంగా కారుమూరిపై పలు ప్రశ్నలు సంధించనున్నారు. ఈ కేసుకు సంబంధించిన అక్రమాలు, నగదు లావాదేవీలపై కీలక అంశాలను రాబట్టేందుకు విచారణ చేయనున్నారు.


కాగా, ఈ కేసులో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల నష్టం జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు మాజీ మంత్రి కారుమూరి, ఆయన కుమారుడు సునీల్ కుమార్ సహా పలువురిని పీఎంఎల్ఏ కింద అరెస్ట్ చేశారు. కారుమూరిని ఈడీ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో కీలక విషయాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్న ఈడీ అధికారులు.. మాజీ మంత్రిని కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

విజయవాడలో వైసీపీ వర్సెస్ స్పోర్ట్స్ కోటా టీచర్లు.. శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

గురజాడ జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

Updated Date - Sep 21 , 2026 | 12:37 PM