Share News

ఆ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు

ABN , Publish Date - Mar 31 , 2026 | 03:29 PM

విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పలు ఓ ప్రైవేట్ బ్యాంక్ శాఖలకు కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంక్ ఖాతాలను సృష్టించి ఈ మోసాలకు పాల్పడ్డారు.

ఆ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు

విజయవాడ, మార్చి 31: నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన మూడు వేర్వేరు శాఖల్లో కేటుగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. ఫేక్ పేస్లిప్‌లు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ అడ్రస్ ప్రూఫ్‌లతో బ్యాంక్ ఖాతాలను సృష్టించారు. తద్వారా సుమారు రూ.5 కోట్ల నిధులు కొల్లగొట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంక్ ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన ఏలూరు రోడ్, గుణదల, బెంజ్ సర్కిల్ పరిధిలో ఉన్న ఆయా శాఖల్లో నకిలీ ఖాతాలు తెరిచారు కేటుగాళ్లు. ఆ అకౌంట్లకు అనుబంధంగా క్రెడిట్ కార్డుల ద్వారా రూ.5,28,19,939 నగదు లూటీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మోసాలకు పాల్పడిన దుండగులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 31 , 2026 | 04:12 PM