కార్యకర్తలకే అభివృద్ధి పనులు.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి కీలక నిర్ణయం
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:25 PM
తిరువూరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో పార్టీ కార్యకర్తలకు అవకాశం కల్పించేలా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 19: తిరువూరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో పార్టీ కార్యకర్తలకు అవకాశం కల్పించేలా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పెద్ద కాంట్రాక్టర్లకే పరిమితమైన అభివృద్ధి పనుల్లో స్థానికంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు అవకాశం కల్పించే విధానానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లకు కాకుండా కార్యకర్తలకు అప్పగించాలని నిర్ణయించారు. ‘కార్యకర్తే కాంట్రాక్టర్’ అంటూ పార్టీ కేడర్‌కు కొలికపూడి శ్రీనివాసరావు ఈ అవకాశం కల్పించారు. అధికారుల సమక్షంలో దాదాపు రూ.10 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన వర్క్ ఆర్డర్ కాపీలను కార్యకర్తలకు ఎమ్మెల్యే అందజేశారు.
తిరువూరు నియోజకవర్గంలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ, కష్టకాలంలో అండగా నిలిచిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఉచితంగా బజాజ్ ప్లాటినా బైక్‌లను కూడా ఎమ్మెల్యే అందజేశారు. స్థానిక అభివృద్ధి పనుల్లో కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీకి కార్యకర్తలే అసలైన వెన్నెముక అని కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్
సాంస్కృతికి పునరుజ్జీవనానికి ఏపీ సర్కార్ కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్
Read Latest AP News And Telugu News