Share News

సాంస్కృతికి పునరుజ్జీవనానికి ఏపీ సర్కార్ కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:59 PM

మహాకవి బోయి భీమన్న ప్రాతఃస్మరణీయుడని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈరోజు విజయవాడలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహాకవి బోయి భీమన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

సాంస్కృతికి పునరుజ్జీవనానికి ఏపీ సర్కార్ కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్
Boi Bhimanna Jayanti

విజయవాడ, సెప్టెంబర్ 19: మహాకవి బోయి భీమన్న ప్రాతఃస్మరణీయుడని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈరోజు(శనివారం) విజయవాడలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహాకవి బోయి భీమన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అర్హులైన కళాకారులందరికీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే ఐడీ కార్డులు అందిస్తామన్నారు. రాజమహేంద్రవరం తెలుగు వర్సిటీకి ‘బోయి భీమన్న కళాపీఠం’ తరలింపుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.


ఏపీలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. భీమన్న రచనలు సమాజంలో ఎంతో స్పృహను, చైతన్యాన్ని రగిలించాయని వెల్లడించారు. నేటి తరానికి మహామహుల రచనలను అందించి సామాజిక వికాసానికి దోహదపడతామని తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖలోని ఉప విభాగాలను శ్రీకృష్ణదేవరాయల భువనవిజయంలోని అష్టదిగ్గజాలతో పోల్చవచ్చని మంత్రి దుర్గేష్ చమత్కరించారు.


జయంతి ఉత్సవాల్లో భాగంగా బోయి భీమన్న జీవిత ఛాయాచిత్రమాలికను మంత్రి పరిశీలించారు. మహాకవి బోయి భీమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత భూసురపల్లి వెంకటేశ్వర్లుకు ‘బోయి భీమన్న అవార్డు-2026’ ప్రదానం చేయడంతో పాటు.. రూ. 2 లక్షల పారితోషికాన్ని కందుల దుర్గేష్ అందజేశారు.


ఇవి కూడా చదవండి...

జగన్‌ యూరప్‌ పర్యటనకు షరతులు

రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 04:02 PM