అమరావతి చట్టబద్ధత బిల్లు.. లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:10 AM
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టి చర్చకు అనుమతించాలని ఎంపీలు కోరారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను(Lok Sabha Speaker Om Birla) టీడీపీ ఎంపీలు ఈరోజు(బుధవారం) ఉదయం కలిశారు. అమరావతి చట్టబద్ధత బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టిన వెంటనే చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను ఎంపీలు కోరారు. అయితే ఈ బిల్లుపై 1 గంట తరువాత చర్చకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. 12 గంటలకు కేంద్ర వాణిజ్యశాఖకు చెందిన జన విశ్వాస్ బిల్లుపై చర్చ ఉందని స్పీకర్ తెలియజేశారు. కావాలంటే కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాలని టీడీపీ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా సూచించారు. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసేందుకు ఆయన ఛాంబర్‌కు టీడీపీ ఎంపీలు వెళ్లారు.
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేదా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెడతారు. ఈరోజే లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. అలాగే రేపు(గురువారం) రాజ్యసభలోనూ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందవచ్చని తెలుస్తోంది. నిన్న ఈ బిల్లును కేంద్ర హోంశాఖ అధికారులు లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు.
ఇవి కూడా చదవండి...
చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య
Read Latest AP News And Telugu News