Share News

స్థానిక ఎన్నికలకు ఐక్యంగా వెళ్తున్నాం: బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:18 PM

చెప్పాం.. చేస్తున్నాం అనే నినాదంతో మంచి వాతావరణంలో స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. కింది స్థాయిలోనూ సమన్వయంతో సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల బరిలో నిలిచామని చెప్పారు.

స్థానిక ఎన్నికలకు ఐక్యంగా వెళ్తున్నాం: బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్
PVN Madhava

అమరావతి, అక్టోబర్ 27: ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే నినాదంతో మంచి వాతావరణంలో స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఈరోజు (మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. కింది స్థాయిలోనూ సమన్వయంతో సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల బరిలో నిలిచామని చెప్పారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏకతాటిపైకి వచ్చామన్నారు. కూటమికి బీటలు వాలుతుందేమో అని ప్రత్యర్థుల ఆశలకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. కూటమి ఐక్యతతోనే సూపర్ ఎల్‌నినోతో పాటు ఎన్నో సవాళ్లు అధిగమించి సుపరిపాలన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.


అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని మాధవ్ అన్నారు. ఇందుకు అందరి ఆశీస్సులు కావాలని కోరారు. స్థానిక ఎన్నికలు ఎంతో కీలకమైనవన్నారు. కూటమి మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారన్నారు. మూడు పార్టీల మధ్య సమన్వయం చాలా గొప్పదని చెప్పుకొచ్చారు. అందరం ఒక్కతాటిపైకి వచ్చి నిర్ణయాలు తీసుకున్నామని.. సార్వత్రిక ఎన్నికలలాగే ఐక్యంగా ముందుకెళ్తామని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీకి ఆర్నబ్ తుఫాన్ ముప్పు.. 20 జిల్లాల కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

సీట్ల సర్దుబాటు పూర్తి.. బీఫామ్‌ ఇచ్చిన వారే అభ్యర్థులు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 12:41 PM