పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గింపు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన లోకేశ్..
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:36 PM
భారత దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాన్యులపై భారం పడుకుండా ఎన్డీయే సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు.
అమరావతి: భారత దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాన్యులపై భారం పడుకుండా ఎన్డీయే సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు. 'పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను లీటర్‌కు రూ.10 తగ్గించారు. డీజిల్‌పై పూర్తిగా రద్దు చేశారు. ప్రజలకు ఉపశమనం కలిగించేలా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఎన్డీయే మరోసారి నిరూపించుకుంది. దేశంలో ఇంధన కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నుంచి ప్రజలకు ఊరటనిస్తూ ఇంధన ధరలు పెరగకుండా భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. అందుకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు' అంటూ లోకేశ్ ప్రశంసించారు.
కాగా, శుక్రవారం నాడు పెట్రోల్, డీజిల్ రెండింటిపై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నూతన పన్నుల ప్రకారం పెట్రోల్‌పై లీటరుకు రూ.3లు తగ్గగా, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం సున్నాగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
రాయవరం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఏపీ మంత్రులు..
త్వరలోనే విజయవాడ, అనంతపురంలో తలసేమియా సెంటర్లు: నారా భువనేశ్వరి