Share News

చేనేతలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ‘నేతన్నల సేవలో’ రెండో విడత సాయం

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:09 AM

చేనేతలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో రెండో విడత నేతన్నల సేవలో ఆర్థిక సాయాన్ని చేనేతలకు సర్కార్ అందజేయనుంది. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.

చేనేతలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ‘నేతన్నల సేవలో’ రెండో విడత సాయం
AP Government

అమరావతి, అక్టోబర్ 1: చేనేతలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో రెండో విడత నేతన్నల సేవలో ఆర్థిక సాయాన్ని చేనేతలకు సర్కార్ అందజేయనుంది. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఈనెల 3వ తేదీ వరకూ ‘నేతన్నల సేవలో’ లబ్ధిదారుల ఎంపిక గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడత ఆర్థిక సాయానికి రాష్ట్ర వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి సవిత తెలిపారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పారదర్శకంగా అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు.


అర్హులైన నేతలన్నలందరికీ రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి ప్రకటించారు. చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు. ప్రతి నేతన్నకూ ఆర్థిక మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. త్వరలో కొత్త పెన్షన్లను కూడా ఇవ్వబోతున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బైక్‌ను ఢీకొట్టి కాలువలో బోల్తా పడిన స్కూల్ బస్సు.. 30 మంది విద్యార్థులకు గాయాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 11:19 AM