బిహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:28 AM
బిహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్ర టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు.
అమరావతి, జూన్ 8: బిహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్ర టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతోన్న వైద్యంపై ఆరా తీశారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీ వెళ్లిన ఈ బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టిందని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, 15 మందికి గాయాలయ్యాయని వివరించారు. బిహార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బాధితులకు సాయం అందేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
ప్రమాదం నుంచి బయటపడిన యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాల మేరకు బిహార్ ఉన్నతాధికారులతో పాటు అక్కడి స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో ఏపీ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను గయాలోని అనుగ్రహ నారాయణ మగధ్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. యాత్రికులను స్వస్థలాలకు చేర్చే అంశంపై బిహార్ ప్రభుత్వంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి..
పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం.. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం
బిహార్ రోడ్డు ప్రమాదంలో నెల్లూరు వాసుల మృతిపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి
Read Latest AP News And Telugu News