Share News

రెచ్చిపోయిన కామాంధుడు.. మతిస్థిమితం లేని బాలికలే టార్గెట్..!

ABN , Publish Date - Mar 21 , 2026 | 10:48 AM

విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి మతిస్థిమితం లేని కుమార్తె ఉంది. చిన్నారిని ఇంటి వద్దనే ఉంచి పనుల నిమిత్తం తల్లిదండ్రులు అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న త్రినాథ్ అనే కామాంధుడి కళ్లు బాలికపై పడ్డాయి.

రెచ్చిపోయిన కామాంధుడు.. మతిస్థిమితం లేని బాలికలే టార్గెట్..!
Vijayawada Crime News

విజయవాడ: పటమట పోలీస్ స్టేషన్(Patamata Police Station) పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మతిస్థిమితం లేని బాలికలే లక్ష్యంగా కామాంధుడు రెచ్చిపోయాడు. చిన్నారులపై అత్యాచారం చేస్తూ కామవాంఛలు తీర్చుకున్నాడు. ఎట్టకేలకు పాపం పండి పోలీసులకు (AP Police) చిక్కాడు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.


విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి మతిస్థిమితం లేని కుమార్తె ఉంది. చిన్నారిని ఇంటి వద్దనే ఉంచి పనుల నిమిత్తం తల్లిదండ్రులు అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న త్రినాథ్ అనే కామాంధుడి కళ్లు బాలికపై పడ్డాయి. ఎవరూ లేని సమయం చూసి చిన్నారిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం ఇంట్లో చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. నిస్సహాయ స్థితిలో త్రినాథ్ వేధింపులను బరించింది చిన్నారి. అయితే, అతని ఆగడాలు మితిమీరి పోవడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు అదే వీధిలో ఉంటున్న మతి స్థిమితం లేని మరో బాలికను విచారించారు. త్రినాథ్ అనే వ్యక్తి తనపైనా లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక చెప్పడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


దీంతో ఇరు కుటుంబాల సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు బాలికలిద్దరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు త్రినాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన నగరవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. చిన్నారులపై లైంగిక దాడులు చేసే వారిని ఉపేక్షించవద్దని నగరవాసులు కోరుతున్నారు. త్రినాథ్‌ను కఠినంగా శిక్షించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీ కార్యకర్తల కుటుంబాలే లక్ష్యంగా రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: మంత్రి నారా లోకేశ్

Updated Date - Mar 21 , 2026 | 10:56 AM