Share News

పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. పరుగులు పెట్టిన అధికారులు

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:56 PM

మైలవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు.

పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. పరుగులు పెట్టిన అధికారులు
AP Minister Nara lokesh

విజయవాడ, మార్చి 18: మైలవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తారక రామానగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వడ్డిస్తున్న భోజనంపై విద్యార్థులను మంత్రి లోకేశ్ ఆరా తీశారు. 'భోజనం రోజూ బాగోవడం లేదా? ఆ ఒక్క రోజే బాగోలేదా?' అంటూ విద్యార్థులను ఈ సందర్భంగా ప్రశ్నించారు.


పాఠశాలలో భోజనం బాగుంటుందంటూ మంత్రికి బదులిచ్చారు విద్యార్థులు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఆ తర్వాత సమీపంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రాన్ని సైతం ఆయన సందర్శించారు. అందులోని చిన్న పిల్లలతో లోకేశ్ ముచ్చటించారు. ఆ తర్వాత పాఠశాల స్థితిగతులపై మైలవరం ఎంఈవో, హెడ్‌మాస్టర్‌తో లోకేశ్ మాట్లాడారు. ఆ క్రమంలో తనతో పాటు తెచ్చిన నివేదికపై ఎంఈఓతో లోకేశ్ చర్చించినట్లు తెలుస్తోంది.


ఉన్నతాధికారులు, పార్టీ శ్రేణులుకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మంత్రి లోకేశ్ ఈ పాఠశాలను సందర్శించారు. లోకేశ్ పర్యటనపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కూ ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. మంత్రి లోకేశ్ రాకను తెలుసుకున్న విద్యా శాఖ అధికారులు మైలవరానికి పరుగులు తీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ ఇన్‌చార్జ్ వీరంగం.. భయాందోళనలో ప్రజలు

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం

For More AP News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 02:56 PM