మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 17 , 2026 | 10:30 AM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, మార్చి 17: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీ వ్యవహారంపై సిట్ విచారణ చేయనుంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ శర్మ రియల్ వ్యాపారాలు తదితర అంశాలపై సిట్ విచారణ జరపనుంది.
ఈ డ్రగ్స్ కేసులో వీటిని ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు? ఈ పార్టీలో పాల్గొనేందుకు వచ్చిన వ్యాపారులు ఎవరు? వారికి మీకు ఉన్నా లింకులు, దుబాయ్ లింకులు తదితర అంశాలపై పలు కోణాల్లో విషయాలను రాబట్టేందుకు ఈ సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి సిట్ నివేదికను అందించనుంది.
మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్‌పై ఆదివారం పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. ఈ సమయంలో న్యూఢిల్లీకి చెందిన నమిత్ శర్మ.. కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వారిని చుట్టిముట్టారు. ఈ సందర్భంగా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. వారిలో పలువురికి పాజిటివ్ వచ్చింది.
వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సైతం ఉన్నారు. ఆయనకు కూడా డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అలాగే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి వారి వారి పార్టీల నుంచి నోటీసులు అందాయి. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ వారికి ఆయా పార్టీలు స్పష్టం చేశాయి. అప్పటి వరకు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ ఇన్‌చార్జ్ వీరంగం.. భయాందోళనలో ప్రజలు
కొత్త అమావాస్య వేళ.. పొరపాటున కూడా ఇలా చేయవద్దు?
For More TG News And Telugu News