Share News

మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం

ABN , Publish Date - Feb 25 , 2026 | 09:42 PM

మచిలీపట్నం చిలకలపూడి సర్కార్ తోట ప్రాంతంలో ఉపాధ్యాయురాలు మార్క్‌రేట్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 50 తులాలు బంగారం, రూ.140,000 నగదును దుండగులు చోరీ చేశారు.

మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం
Machilipatnam Theft News

కృష్ణా, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం చిలకలపూడి సర్కార్ తోట ప్రాంతంలో ఉపాధ్యాయురాలు మార్క్‌రేట్ ఇంట్లో ఇవాళ(బుధవారం) భారీ చోరీ జరిగింది. దాదాపు 50 తులాల బంగారం, రూ.140,000లని దుండగులు చోరీ చేశారు. గుడ్లవల్లేరు మండలం కౌతరం ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా నిమ్మగడ్డ మార్క్‌రేట్ పనిచేస్తున్నారు. ఈరోజు(బుధవారం) ఇంటికి తాళాలు వేసుకొని పాఠశాలకు ఉపాధ్యాయురాలు వెళ్లారు.


ఇంటిలో ఎవరు లేకపోవడంతో ఇంటి తలుపులు పగలకొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. రంజాన్ మాసం కావడంతో మధ్యాహ్నమే ఉపాధ్యాయురాలు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగిందని ఆమె గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉపాధ్యాయురాలు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్లతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హెరిటేజ్‌కి.. వీఎస్ఆర్ ఏవియేషన్‌కి ఎలాంటి సంబంధం లేదు: మంత్రి నారా లోకేశ్

వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 25 , 2026 | 09:45 PM