Share News

ఈడీ విచారణకు కృష్ణమోహన్ రెడ్డి.. ఏబీఎన్‌ను చూడగానే పరుగో పరుగు

ABN , Publish Date - Mar 09 , 2026 | 01:55 PM

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణ అనంతరం బయటకు వచ్చిన మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి.. ఏబీఎన్‌ మైక్‌ను చూసి పరుగులు పెట్టారు. ఏబీఎన్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కృష్ణమోహన్ రెడ్డి నీళ్లు నమిలారు.

ఈడీ విచారణకు కృష్ణమోహన్ రెడ్డి.. ఏబీఎన్‌ను చూడగానే పరుగో పరుగు
ED Interrogation

అమరావతి/హైదరాబాద్, మార్చి 9: ఏపీ లిక్కర్ స్కామ్‌(AP Liquor Scam కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వెంకటేశ్ నాయుడుతో పాటు మరికొంత మందికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఈరోజు వారంతా ఈడీ ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని ఈడీ విచారించింది. దాదాపు గంటన్నరగా ఆయనను ఈడీ అధికారులు విచారించారు. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, పాన్ కార్డ్స్, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల పత్రాలను ఈడీకి అందజేశారు కృష్ణమోహన్ రెడ్డి. ఎప్పుడు విచారణకు ఆదేశించినా అందుబాటులో ఉండాలని ఈడీ ఆదేశించింది.


ఈడీ విచారణ ముగిసిన తర్వాత కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కృష్ణమోహన్ రెడ్డిని ఏబీఎన్‌ ప్రతినిధి ప్రశ్నించారు. ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేశారో చెప్పాలని కోరారు. అయితే, ఏబీఎన్ ప్రతినిధి ప్రశ్నలకు కృష్ణమోహన్ రెడ్డి నీళ్లునమిలారు. ‘ఈడీ విచారణకు నేను సహకరిస్తున్నాను. ఈడీ అడిగిన డాక్యుమెంట్లు అన్ని అందజేశాను. నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను’ అని మాత్రమే చెప్పారు. ఏబీఎన్ మైక్‌ను చూసి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏబీఎన్ ప్రతినిధికి సమాధానం చెప్పలేక రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటోను అడ్డగించి అందులో ఎక్కి కృష్ణమోహన్ రెడ్డి వెళ్లిపోయారు.


ఇవి కూడా చదవండి..

కాకినాడలో పెద్దపులి కలకలం.. అటవీ అధికారుల అలర్ట్

రాజంపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం.. హాస్టల్ యజమానిపై కర్రలతో దాడి!

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 02:03 PM