ఏపీ లిక్కర్ స్కామ్.. ఆ ముగ్గురికి ఈడీ నోటీసులు
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:04 AM
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
అమరావతి, మార్చి 9: ఏపీ లిక్కర్ స్కామ్(AP Liquor Scam) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పాన్ కార్డులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలతో పాటు సంబంధిత డాక్యుమెంట్లను తీసుకురావాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. నేడు(సోమవారం) విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మద్యం స్కామ్‌లో వేల కోట్ల రూపాయల కమీషన్లు, మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే రూ.441 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీఐడీ సిట్ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా కీలక నిందితులకు సంబంధించిన ఆస్తులను భారీ ఎత్తున జప్తు చేసింది. ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, చాణక్య, వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
తిరుపతి జిల్లాలో విషాదం.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి రెండు ఏనుగులు మృతి
కాకినాడలో పెద్దపులి కలకలం.. అటవీ అధికారుల అలర్ట్
Read Latest AP News And Telugu News