జగన్ క్రెడిట్ చోరీ చేస్తే జైలుకే.. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సెటైర్
ABN , Publish Date - Jul 29 , 2026 | 03:01 PM
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్.. చంద్రబాబు కోట్టేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, జులై 29: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్.. చంద్రబాబు కోట్టేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నపుడు భోగాపురం వచ్చి.. ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్‌పోర్ట్ ఎందుకన్నారని గుర్తుచేశారు. జగన్ క్రెడిట్ ఎవరూ చోరీ చేయరని.. ఆయన క్రెడిట్ చోరీ చేస్తే జైలుకే వెళతారంటూ సెటైర్ విసిరారు.
జగన్ వ్యవహారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంపీ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించే విధంగా వైసీపీ అధినేత మాట్లాడారని విమర్శించారు. ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్ ఎలా వస్తుందని అవహేళన చేశారన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారని తెలిపారు. నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అద్భుతంగా ముందుకు వెళుతోందని చెప్పుకొచ్చారు. డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. లోకేశ్ వేసిన సవాల్‌కు జగన్ పారిపోయారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దేశానికి, తెలుగు ప్రజలకు ఒక ఆదర్శమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కొనియాడారు.
ఇవి కూడా చదవండి...
‘నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా’.. ఆదోని చిన్నారుల వీడియోపై లోకేశ్
మెగా డీఎస్సీపై వైసీపీవి నిరాధార ఆరోపణలు: సానా సతీష్ బాబు
Read Latest AP News And Telugu News