Share News

రైసినా డైలాగ్-2026 సదస్సు.. సీఎం చంద్రబాబు ముఖ్య ప్రసంగం..

ABN , Publish Date - Mar 06 , 2026 | 06:17 PM

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైసినా డైలాగ్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ఫిన్లాండ్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా 110 దేశాలకు చెందిన 2,700మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.

రైసినా డైలాగ్-2026 సదస్సు.. సీఎం చంద్రబాబు ముఖ్య ప్రసంగం..
Raisina Dialogue 2026

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) రేపు(శనివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. దేశ రాజధానిలో జరిగే ప్రతిష్టాత్మక 'రైసినా డైలాగ్-2026' సదస్సు (Raisina Dialogue Summit-2026)కు హాజరుకానున్నారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి టూర్ షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఉదయం 10:50గంటలకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరుతారు.


ఢిల్లీకి చేరుకున్న అనంతరం మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రైసినా డైలాగ్-2026 సదస్సులో పాల్గొంటారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైసినా డైలాగ్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ఫిన్లాండ్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా 110 దేశాలకు చెందిన 2,700మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ‘జియో పాలిటిక్స్- జియో ఎకనామిక్స్’ అంశం ఆధారంగా చర్చలు సాగనున్నాయి.


ఈ సదస్సులో 'సాంకేతికత- సుపరిపాలన- భవిష్యత్' అనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు, డిజిటల్‌ పౌర సేవలు వంటి అంశాలను వివరించనున్నారు. అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ డెస్టినేషన్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు అనుసరిస్తున్న నిర్ణయాలను వారికి తెలపనున్నారు సీఎం చంద్రబాబు.


ఈ వార్తలు కూడా చదవండి

తిరువూరులో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు!

చీరకట్టులో మహిళల సాహనం! చూసి తీరాల్సిన వీడియో

Updated Date - Mar 06 , 2026 | 07:13 PM