Share News

తిరువూరులో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు!

ABN , Publish Date - Mar 06 , 2026 | 06:07 PM

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠగ పరాకాష్టకు చేరింది. తిరువూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపై టీడీపీ, విపక్ష వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే..

తిరువూరులో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు!
Tiruvuru Tension News

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా(NTR Distt) తిరువూరు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరువూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీ, విపక్ష వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల కీలక నేతలు ‘బోసు బొమ్మ’ సెంటర్‌లో చర్చకు వెళ్తున్న విషయం తెలుసుకొని పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అనంతరం ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బోస్ బొమ్మ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.


గత రెండు రోజులుగా తిరువూరు పట్టణంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఇరు వర్గాల నేతలకు స్థానిక తహశీల్దార్ నచ్చజెప్పాలని చూసినా వినకపోవడంతో తిరువూరు మండల వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ప్రజలు గుంపులుగా ఉన్నా, ఉద్రిక్తతలకు కారణమయ్యే ర్యాలీలు, సభలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్‌పై సీఎం కీలక ప్రకటన

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 07:54 PM