గుడ్ న్యూస్.. పీఎన్జీ కనెక్షన్ తీసుకుంటే రూ.2,400 సబ్సిడీ..
ABN , Publish Date - Apr 10 , 2026 | 09:20 PM
ఎల్పీజీ గ్యాస్ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఎన్జీ కనెక్షన్లు తీసుకునే దీపం-2 పథకం లబ్ధిదారులకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు.
అమరావతి: ఇరాన్, ఇజ్రాయెల్ - అమెరికా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడినా దాని ప్రభావం ఇప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని రోజులుగా వంట గ్యాస్ సమస్య తలెత్తింది. ఈ మేరకు ఎల్పీజీ గ్యాస్ (Liquefied Petroleum Gas) సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఎన్జీ (Piped Natural Gas) కనెక్షన్లు తీసుకునే దీపం-2 పథకం లబ్ధిదారులకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు.
‘ఆంధ్రప్రదేశ్ పీఎన్జీ సబ్వెన్షన్ స్కీమ్’ పేరుతో ఏడాదికి రూ.2,400 రాయితీ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుని ఖాతాలో నగదు జమ అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. వినియోగదాలను ఎల్పీజీ నుంచి పీఎన్జీకి ప్రోత్సహించేలా సబ్సిడీ విస్తరించాలని పథక రచన చేశారు. 2 నెలలకోసారి 6 విడతల్లో నగదు చెల్లింపు చేయనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీపం-2 అర్హత గల డొమెస్టిక్ పీఎన్జీ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులు మాత్రమే దీనికి అర్హులని సీఎం చెప్పారు. ఎల్పీజీ, పీఎన్జీలో ఏదో ఒక దానికే సబ్సిడీ వర్తింప చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..
బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్