Share News

గ్రూప్-1 నిర్వహణలో అక్రమాలు.. వైసీపీని నిలదీయాల్సిందేనన్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 12 , 2026 | 03:41 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవలి కాలంలో ఇంత అన్యాయంగా జవాబుపత్రాల ముల్యాంకనం ఎన్నడూ జరగలేదని.. మూడు సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

గ్రూప్-1 నిర్వహణలో అక్రమాలు.. వైసీపీని నిలదీయాల్సిందేనన్న సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, ఆగస్టు 12: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని సీఎం అన్నారు. ఇటీవలి కాలంలో ఇంత అన్యాయంగా జవాబుపత్రాల ముల్యాంకనం ఎన్నడూ జరగలేదని.. మూడు సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించిందని.. దీనిపై వైసీపీని నిలదీయాల్సిందే అని మంత్రులకు సూచించారు.


మంత్రులు అందరూ సిట్ రిపోర్ట్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వైసీపీ నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. వాటిపై అసెంబ్లీలో కూడా చర్చిద్దామన్నారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీలో ఎటువంటి తప్పులూ చేయలేదని, అంతా పారదర్శకంగా జరిగిందని తెలిపారు. డీఎస్సీపై వైసీపీ శాసనమండలిలో లేవనెత్తితే దీటుగా సమాధానం చెబుదామన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని, ఆధారాలతో సహా నిరూపిద్దామని మంత్రులకు సూచించారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అగ్రెసీవ్‌గా ముందుకు వెళదామని, వైసీపీ నేతలను అసెంబ్లీకి రమ్మని సవాల్ చేయాలన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట డ్రామాలాడితే ప్రజలు నమ్మరని చెప్పుకొచ్చారు. రాని, అర్హత లేని ప్రతిపక్ష హోదాను ఎవరిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.


గతంలో వైసీపీ అధికారంలో ఉండగా.. 23 మంది ఉంటే నలుగురిని లాగేస్తే ప్రతిపక్షహోదా టీడీపీకి పోతుందని జగన్ చెప్పారని, ఇప్పుడు ఆ మాటలను మరిచిపోయారని మంత్రులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆనాటి జగన్ మాటలు నేటికీ చక్కర్లు కొడుతున్నాయని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలపై శాసనమండలిలో దుమ్ముదులుపుతామని మంత్రులు అన్నారు. ఈ సందర్భంగా సిట్ నివేదికను తెలుగులోకి అనువదించి మరీ మంత్రులకు సీఎంవో అధికారులు వివరించారు.


ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 04:47 PM