ఆ విషయంలో జగన్‌ను వైసీపీ నేతలు నిలదీయాలి: పీవీఎన్ మాధవ్
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:24 PM
రాజధాని అమరావతి విషయంలో విషం చిమ్మిందే జగన్ అని ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. మూడుసార్లు మూడు మాటలు మార్చిన జగన్‌ను వైసీపీ శ్రేణులు నిలదీయాలని అన్నారు.
అమరావతి, ఏప్రిల్ 7: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై(ABN Andhrajyothy) వైసీపీ దాడికి యత్నించడంపై బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్(AP BJP Chief PVN Madhav) స్పందించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తెగబడటం సరి కాదన్నారు. రాజధాని అమరావతి విషయంలో విషం చిమ్మిందే జగన్ అంటూ వ్యాఖ్యానించారు. మూడుసార్లు మూడు మాటలు మార్చిన జగన్‌ను వైసీపీ శ్రేణులు నిలదీయాలని అన్నారు. కథనాలపై అభ్యంతరాలు ఉంటే.. ఖండించాలి, చర్చించాలని సూచించారు.
సాక్షి మీడియాలో తమపై దారుణమైన కథనాలు వస్తున్నాయని.. వాటిపై కూటమి పార్టీల నేతలు ఖండనలు కూడా చేయడం లేదన్నారు. అమరావతిపై ద్వేషం పెంచుకున్న జగన్... ఇప్పటికీ అదే పంథాలో వెళుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ మనసు మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పీవీఎన్ మాధవ్ హితవుపలికారు.
దాడి అమానుషం: ఎంపీ సీఎం రమేశ్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణకు వైసీపీ క్షమాపణ చెప్పాలని ఎంపీ సీఎం రమేశ్ డిమాండ్ చేశారు. వైసీపీ అల్లరి మూకల తాటాకు చప్పుళ్లకు రాధాకృష్ణ బెదిరేది లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులు జరిగాయని.. ఇప్పుడు అదే సంస్కృతిని జగన్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. వార్తల్లో తప్పు ఉందని అనిపిస్తే ఖండించాలి కానీ దాడి చేయడం అమానుషమన్నారు. ఇదే వైఖరి అవలంబిస్తే సాక్షి మీడియా సంస్థలను నడపగలరా అని ఎంపీ సీఎం రమేశ్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
జగన్ రెడ్డి.. జీరో రెడ్డిగా మిగలడం ఖాయం: ఎంపీ కేశినేని శివనాథ్
తప్పు చేసిన వారు ఎప్పటికీ కాలం నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర
Read Latest AP News And Telugu News