క్రిమినల్ రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:38 PM
సమాజంలో క్రిమినల్ అంటే భయపడతామని, క్రిమినల్ చేసే పనులు సమాజానికి హానికరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అటువంటి క్రిమినల్.. రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందనేది ఏపీలో చూస్తున్నామని తెలిపారు.
అమరావతి, ఆగస్టు 25: సమాజంలో క్రిమినల్ అంటే భయపడతామని, క్రిమినల్ చేసే పనులు సమాజానికి హానికరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అటువంటి క్రిమినల్.. రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందనేది ఏపీలో చూస్తున్నామని తెలిపారు. క్రిమినల్ చేసిన తప్పులు వేరేవారిపై పెట్టి వారు బాధితులుగా మారే విధంగా చేస్తారని మండిపడ్డారు. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో అందరికీ తెలుసన్నారు. 2019లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రకృతి వనరులను దోచుకున్నారని ఆరోపించారు.
బలహీన వర్గాలను అడ్డం పెట్టుకుని మెడ మీద కత్తి పెట్టి మరీ వేధింపులకు గురిచేశారని మంత్రి విమర్శించారు. గొడ్డలిపార్టీ అధినేత ఆర్థికంగా బలపడ్డారని.. బలహీన వర్గాలను బాధితులను చేశారని ఆరోపించారు. 2019 నుంచి 2024 వరకు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఈడీ.. కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేసిందన్నారు. ‘జోగి రమేష్ నీ కుటుంబ వ్యవహారంతో చంద్రబాబు, లోకేశ్‌కు ఏంటి సంబంధం? మీ లాంటి నీచ చరిత్ర చంద్రబాబుకు, లోకేశ్‌కు లేదు. ముందు తెలుసుకోండి’ అంటూ వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2019 వరకు బీసీలకు స్వర్ణయుగమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
విశాఖ జూలో 128 కొత్త ప్రాణాలు.. సిబ్బందికి పవన్ కల్యాణ్ అభినందనలు
Read Latest AP News And Telugu News