Share News

ఏపీలో 28 జిల్లా ప్రజా పరిషత్‌లకు ఎన్నికలు పూర్తి.. కూటమికి 27 స్థానాలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో 28 జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు పూర్తయ్యాయి. 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో ఒక్క అల్లూరు జిల్లా మినహా మిగతా 27 పదవులు కూటమి పార్టీలు దక్కించుకున్నాయి.

ఏపీలో 28 జిల్లా ప్రజా పరిషత్‌లకు ఎన్నికలు పూర్తి..  కూటమికి 27 స్థానాలు
AP Zilla Parishad Elections

అమరావతి, నవంబర్ 20: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు పూర్తయ్యాయి. 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో ఒక్క అల్లూరు జిల్లా మినహా మిగతా 27 పదవులు కూటమి పార్టీలు దక్కించుకున్నాయి. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో తెలుగుదేశం పార్టీ 22, జనసేన పార్టీ 4, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.


దీంతో మొత్తం 27 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు కూటమి ఖాతాలో చేరాయి. మరోవైపు అల్లూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా వైసీపీకి చెందిన వంతల శాంతి ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పేర్లు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల వివరాలను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.


ఇవి కూడా చదవండి...

తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తం

పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా.. కోరం లేక నిలిచిన ప్రక్రియ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 04:45 PM