Share News

గిరిజనులను భయపెట్టి అబద్ధపు ప్రచారం.. వైసీపీపై మంత్రి సంధ్యారాణి ఫైర్

ABN , Publish Date - Aug 17 , 2026 | 04:07 PM

‘పాఠాలు చెప్తాం.. గుణపాఠాలు కూడా నేర్పుతాం’ అంటూ టీచర్లు చేస్తున్న ర్యాలీలను గొడ్డలి పార్టీ గుర్తు పెట్టుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గిరిజనులను గొడ్డలి పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

గిరిజనులను భయపెట్టి అబద్ధపు ప్రచారం.. వైసీపీపై మంత్రి సంధ్యారాణి ఫైర్
Minister Gummadi Sandhyarani

అమరావతి, ఆగస్టు 17: ‘పాఠాలు చెప్తాం.. గుణపాఠాలు కూడా నేర్పుతాం’ అంటూ టీచర్లు చేస్తున్న ర్యాలీలను గొడ్డలి పార్టీ గుర్తు పెట్టుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు(సోమవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గిరిజనులను గొడ్డలి పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇవ్వకపోతే మారాం చేస్తున్నట్టు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని అనడం హాస్యాస్పదమన్నారు. 1/70 యాక్ట్.. అంటే గిరిజనుల భూ సంరక్షణ చట్టం రద్దు అవుతుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని.. గిరిజనుల భూములు, హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో గిరిజనులు ఏమాత్రం భయపడవద్దన్నారు.


గిరిజనులను మభ్యపెట్టి, భయపెట్టి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఐటీడీఏ ఆపేసి, 18 పథకాలను నిలుపుదల చేశారని తెలిపారు. గురివిందకు తన తప్పు ఎరుగదు అన్నట్టు వైసీపీ నేతల తీరు ఉందని విమర్శించారు. జీవో నం 3 రద్దు చేస్తే అప్పుడు సీఎంగా జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన తాడేపల్లిలో ఉంటాడో బెంగళూరులో ఉంటాడో ఎవరికీ తెలియదంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం: సీఎం చంద్రబాబు

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు శాశ్వత మైలురాయి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 17 , 2026 | 04:18 PM