సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ SEC అనిల్ చంద్ర పునేఠా స్పందన
ABN , Publish Date - Aug 24 , 2026 | 02:58 PM
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా స్పందించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని స్పష్టం చేశారు.
అమరావతి, ఆగస్టు 24: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా స్పందించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని స్పష్టం చేశారు. వాట్సాప్ ప్రచారంలో ఉన్న ఎన్నికల తేదీలు, షెడ్యూల్ నకిలీవి అని చెప్పుకొచ్చారు. అధికారిక అనుమతి లేకుండా ఎన్నికల సంఘం పేరు, లోగో దుర్వినియోగం చట్టరీత్యా నేరమని అన్నారు. అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని.. షేర్ చేయొద్దని తెలిపారు.
తప్పుడు సమాచారం ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించారు. ఎఅధికారిక ప్రకటనల ద్వారానే న్నికలకు సంబంధించిన సమాచారం విడుదల అవుతుందన్నారు. సోషల్ మీడియా సమాచారాన్ని అధికారికంగా పరిగణించొద్దని అన్నారు. ఎన్నికల సంఘం అధికారిక సమాచారాన్నే ఆధారంగా తీసుకోవాలని ప్రజలు, మీడియాకు సూచించారు. ఈ మేరక ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా ప్రకటన విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి...
హోం మంత్రి అనితపై కూలిన డ్రోన్.. చేతికి స్వల్ప గాయం
కాస్త ఆలస్యమైనా నదుల అనుసంధానం పక్కా: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
Read Latest AP News And Telugu News