Share News

హోం మంత్రి అనితపై కూలిన డ్రోన్.. చేతికి స్వల్ప గాయం

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:44 PM

అమరావతి ఛాంపియన్‌షిప్ ప్రారంభ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో డ్రోన్ కిందపడిపోయింది. హోంమంత్రి వంగలపూడి అనితపై డ్రోన్ కూలింది.

హోం మంత్రి అనితపై కూలిన డ్రోన్.. చేతికి స్వల్ప గాయం
Amaravati Championship

తిరుపతి, ఆగస్టు 24: అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 ప్రారంభ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. హోం మంత్రి వంగలపూడి అనితపై డ్రోన్ కూలడంతో కుడి చేతికి స్వల్ప గాయమైంది. అమరావతి ఛాంపియన్‌షిప్ కార్యక్రమంలో భాగంగా డ్రోన్‌ను ఎగురవేశారు. అయితే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో డ్రోన్ కిందపోయింది. దీంతో అక్కడే ఉన్న హోంమంత్రి చేతికి డ్రోన్ తగలడంతో గాయమైంది. వెంటనే వైద్యసిబ్బంది అనితకు చికిత్స అందజేశారు.


కాగా, ఈరోజు(సోమవారం) ఉదయం అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను హోంమంత్రి అనిత, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూల నుంచి దాదాపు పదివేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. పోటీల కోసం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ సహా మొత్తం 9 వేదికలను అధికారులు సిద్ధం చేశారు. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజయవాడలో అమరావతి ఛాంపియన్‌షిప్ ముగింపు వేడుకలు జరుగనున్నాయి.


ఇవి కూడా చదవండి...

అమరావతి ఛాంపియన్‌షిప్ 2026.. తిరుపతిలో పోటీలను ప్రారంభించిన మంత్రులు

20వేల మంది జెన్‌జీ యువతతో మాటామంతి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 01:25 PM