Share News

20వేల మంది జెన్‌జీ యువతతో మాటామంతి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:36 PM

స్వామి వివేకానంద, శ్రీశ్రీ చెప్పినట్టు యువత పాత్రే దేశానికీ కీలకమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నేడు యువత దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తోందని తెలిపారు.

20వేల మంది జెన్‌జీ యువతతో మాటామంతి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
Kotamreddy Sridhar Reddy

నెల్లూరు, ఆగస్టు 24: స్వామి వివేకానంద, శ్రీశ్రీ చెప్పినట్టు యువత పాత్రే దేశానికి కీలకమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నేడు యువత.. దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులన్న తేడా లేకుండా యువత రాజకీయ నాయకులను ప్రశ్నిస్తోందని.. ఇది మంచి నిర్ణయమని.. దీన్ని తాను కూడా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 20 వేల మంది జెన్‌జీ యువతతో 55 రోజుల పాటు 51 చోట్ల మాటామంతి నిర్వహిస్తున్నామని తెలిపారు. రేపు(మంగళవారం) ఉదయం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.


ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి.. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై చర్చ నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి నారా లోకేశ్ ఎన్నో వ్యయప్రయాసలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిపై చర్చ ఉంటుందన్నారు. యువత ఉద్యోగాలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. సీఎం చంద్రబాబు ముందు చూపుతో తీసుకొచ్చిన కంప్యూటర్ వలనే ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. మాటామంతి కార్యక్రమంలో బహిరంగంగా మాట్లాడలేని వారు.. ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ ద్వారా తనతో చర్చించవచ్చని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

గుర్రాల బీచ్‌ వద్ద యువకుల గల్లంతుపై పవన్ కల్యాణ్ ఆందోళన

అమరావతి ఛాంపియన్‌షిప్ 2026.. తిరుపతిలో పోటీలను ప్రారంభించిన మంత్రులు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 01:04 PM