భూగర్భ జలాలు పెంచడానికి కృషి చేయాలి: మంత్రి నిమ్మల రామానాయుడు
ABN , Publish Date - May 15 , 2026 | 02:26 PM
ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ నాటికి ఓఅండ్ఎం పనులు పూర్తిచేసేలా సీఈ స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు.
విజయవాడ, మే 15: ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరంలోనే రెండు విడతలుగా ఓఅండ్ఎం పనుల కోసం రూ.708 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. నేడు కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, అత్యవసర మరమ్మతుల పనుల కోసం రూ.397 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి కనీస నిర్వహణ పనులు చేయలేదని విమర్శించారు. అత్యవసర పనుల కోసం రూ.10 లక్షలు దాటితే.. కాలయాపన లేకుండా, 7 రోజుల్లోనే షార్ట్ టెండర్లు పిలిచేలా కేబినెట్ ఆమోదించిందని అన్నారు.
ఖరీఫ్ నాటికి ఓఅండ్ఎం పనులు పూర్తిచేసేలా సీఈ స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. ఓఅండ్ఎం పనులకు సంబంధించి ప్రతివారం పనుల వివరాలు, వర్క్ ప్రోగ్రెస్ రిపోర్టు అందించాలన్నారు. జలధారకు, ఓఅండ్ఎం పనులను కూడా సమన్వయం చేసి.. భూగర్భ జలాలు పెంచడానికి కృషి చేయాలని సూచించారు. ఈనెలలో జలధారపై కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్, ముఖ్యమంత్రి చంద్రబాబు.. కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు ఇరిగేషన్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ శశిభూషణ్, కడా కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
నా దేశం.. నా బాధ్యత నినాదంతో ముందుకు సాగాలి: మంత్రి కొల్లు రవీంద్ర
రాయలసీమ ఒకప్పుడు డ్రాట్ జోన్.. ఇప్పుడు గ్రోత్ జోన్: చంద్రబాబు
Read Latest AP News And Telugu News