Share News

భార్యపై కోపంతో నాలుగేళ్ల కుమార్తెను బావిలో పడేసిన తండ్రి

ABN , Publish Date - May 15 , 2026 | 01:10 PM

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ.. అభం శుభం తెలియని ఒక పసిప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే..

భార్యపై కోపంతో నాలుగేళ్ల కుమార్తెను బావిలో పడేసిన తండ్రి
Andhra Pradesh Crime News

కోరుకొండ, మే 15: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ.. అభం శుభం తెలియని ఒక పసిప్రాణాన్ని బలితీసుకుంది. కన్న తండ్రే కాలయముడుగా మారి కూతురిని బావిలోకి నెట్టి చంపేసిన అమానుష ఘటన కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాదరాడ గ్రామానికి చెందిన రామవరపు రాజు, అతని భార్య మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.


శుక్రవారం కూడా దంపతుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన రాజు, భార్యపై ఉన్న కక్షతో, ఏ పాపం తెలియని చిన్నారి లహరిని తీసుకువెళ్లి సమీపంలోని ఒక బావిలో పడేశాడు. నీటిలో మునిగి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది లహరి. అప్పటి వరకు కళ్లముందే ఆడుకున్న బిడ్డ నిర్జీవంగా పడి ఉండటం చూసి తల్లి, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కోరుకొండ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కన్నకూతురిని పొట్టనబెట్టుకున్న రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఇక కాలం చెల్లింది: సీఎం చంద్రబాబు

మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు.. నేను అడగలేదు: కోదండరాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2026 | 01:43 PM