AP Government: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇక నుంచి అదనంగా..
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:34 PM
రేషన్ దుకాణాల ద్వారా గురువారం నుంచి ప్రజలకు గోధుమపిండిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఈ మేరకు ఈ పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాలశాఖ ఎండీ ఢిల్లీ రావు, కలెక్టర్ కలెక్టర్ లక్ష్మీ శా, జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా ప్రారంభించారు.
విజయవాడ, జనవరి1 (ఆంధ్రజ్యోతి): రేషన్ దుకాణాల (Ration Shops) ద్వారా ఈరోజు(గురువారం) నుంచి ప్రజలకు గోధుమపిండిని (Wheat Flour Distribution) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) అందజేయనుంది. ఈ మేరకు ఈ పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాలశాఖ ఎండీ ఢిల్లీ రావు, కలెక్టర్ కలెక్టర్ లక్ష్మీ శా, జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఢిల్లీ రావు. నేటి నుంచి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అదనంగా నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామని తెలిపారు.
బియ్యం, పంచదారతో పాటు, గోధుమపిండి, జొన్నలు కూడా ఇస్తున్నామని వెల్లడించారు. ఇటీవల సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు ప్రజలకు నాణ్యమైన గోధుంపిండి తక్కువ ధరకు ఇవ్వాలని సూచించారని ప్రస్తావించారు. తమ ఉన్నతాధికారులు ఎఫ్‌సీఐతో కో ఆర్డినేట్ చేసుకుని 1850 టన్నుల గోధుమపిండి ప్రతి నెలా వచ్చేలా మాట్లాడారని తెలిపారు. మంచి ప్యాకింగ్‌తో చక్కీ గోధుమపిండిని ప్రజలకు కిలో రూ. 20లకే అందజేస్తున్నామని వెల్లడించారు.
ప్రతి శాంపిల్‌ను తమ క్వాలిటీ వింగ్ పరిశీలించిన తర్వాతే ప్యాకింగ్ చేయించారని చెప్పుకొచ్చారు. 17లక్షల కార్డు హోల్డర్స్‌కు ఇచ్చేందుకు ఇప్పుడు స్టాకు ఉందని తెలిపారు. జిల్లా కేంద్రాలతో పాటు, ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ఈ గోధుమపండి అందజేస్తామని వివరించారు. ఇప్పుడు ఆరు జిల్లాల్లో అమలు చేస్తున్నామని, వచ్చే నెల మరో రెండు జిల్లాల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఢిల్లీ రావు సూచించారు.
హెల్తీ గోధుమపిండితో ఆరోగ్యం: కలెక్టర్ లక్ష్మీశా
రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఈరోజు నుంచి చక్కీ గోధుమపిండి పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. పిల్లలు, వృద్ధులకు మంచి న్యూట్రిషన్ ఫుడ్‌గా ఇది బాగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. హెల్తీ గోధుమపిండితో ఆరోగ్యం కూడా బాగుంటుందని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News