ఫలించిన 10 గంటల శ్రమ.. అదుపులోకి కోనసీమ ఓఎన్‌జీసీ గ్యాస్ మంటలు
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:31 PM
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో గల ఓఎన్‌జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి నుంచి ఎగిసిపడుతున్న మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. 10 గంటల పాటు శ్రమించిన ఓఎన్‌జీసీ నిపుణుల బృందం మంటలను అదుపులోకి తెచ్చింది.
కోనసీమ జిల్లా, నవంబర్ 17: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో గల ఓఎన్‌జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి నుంచి ఎగిసిపడుతున్న మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. 10 గంటల పాటు శ్రమించిన ఓఎన్‌జీసీ నిపుణుల బృందం మంటలను అదుపులోకి తెచ్చింది. దీంతో సమీప గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో.. ఒక్కసారిగా భారీ శబ్దం వెలువడి.. గ్యాస్ బావి నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
కోనసీమలో గ్యాస్ లీకేజీ.. ప్రజలను ఖాళీ చేయించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
విశాఖలో 20 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి
Read Latest AP News And Telugu News