Share News

ముగిసిన వైసీపీ నేత నిత్యానంద రెడ్డి పోలీస్ కస్టడీ

ABN , Publish Date - May 21 , 2026 | 03:34 PM

వైసీపీ నేత, మాజీ డిఫ్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానంద రెడ్డిని రెండు రోజుల పాటు చిన్నచౌక్ పోలీసులు విచారించారు.

ముగిసిన వైసీపీ నేత నిత్యానంద రెడ్డి పోలీస్ కస్టడీ
Kadapa News

కడప, మే 21: వైసీపీ నేత, మాజీ డిఫ్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నిత్యానంద రెడ్డిని రెండు రోజుల పాటు చిన్నచౌక్ పోలీసులు విచారించారు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేతను కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పెద్ద దస్తగిరి హత్య కేసులో నిందితుల వాంగ్మూలం మేరకు వైసీపీ నేతను విచారించారు. హత్య తర్వాత నిందితులు పారిపోయేందుకు మాజీ డిప్యూటీ మేయర్ సహకరించారనే కోణంలోనూ విచారణ జరిగినట్లు తెలుస్తోంది.


పెద్ద దస్తగిరి, నిత్యానంద రెడ్డి మధ్య భూ లావాదేవీలపై విచారించినట్లు సమాచారం. దస్తగిరి హత్య వెనుక మరికొందరి పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మొబైల్ కోర్టు జడ్జి ముందు నిత్యానంద రెడ్డిని ప్రవేశపెట్టిన పోలీసులు.. అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు.


ఇవి కూడా చదవండి...

కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్‌ సభ్యులు.. ఏసీ ఆగ్రహం

హైబ్రిడ్ విధానంలో మహానాడును సక్సెస్‌ చేయాలి: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2026 | 03:40 PM