Share News

మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ABN , Publish Date - May 21 , 2026 | 01:16 PM

ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండగ సెలవు దినాన్ని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అమరావతి, మే 21: ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండగ సెలవు దినాన్ని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన ఈ బక్రీద్‌ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


గతంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక క్యాలెండర్ ప్రకారం.. మే 27వ తేదీ బక్రీద్ సెలవుగా ప్రకటించారు. అయితే చంద్రదర్శనం ఆధారంగా పండుగ తేదీ మారింది. దాంతో సెలవు రోజును కూడా మార్చాలని ఏప రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వాహణాధికారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ బోర్డు సీఈవో చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలించింది. అనంతరం సెలవును మే 28కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోవో జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ చైర్మన్‌‌తోపాటు సభ్యులను నియమించిన ప్రభుత్వం

పాతబస్తీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

For More AP News And Telugu News

Updated Date - May 21 , 2026 | 01:29 PM