Share News

మదీనా చౌరస్తాలోని వస్త్ర దుకాణాల్లో అగ్ని ప్రమాదం..

ABN , Publish Date - May 21 , 2026 | 10:35 AM

పాతబస్తీలోని చార్మినార్ సమీపంలోని మదీనా చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం వస్త్ర దుకాణాల్లో భారీగా మంటలు చెలరేగాయి.

మదీనా చౌరస్తాలోని వస్త్ర దుకాణాల్లో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌, మే 21: పాతబస్తీ చార్మినార్ సమీపంలోని మదీనా సమీపంలోని ఎస్‌వైజే కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఈ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఎస్‌వైజే కాంప్లెక్స్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అగ్ని కీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.


ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 100కు పైగా దుకాణాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు. షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. భారీగా నష్టం ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రహదారిపై భారీగా అగ్నిమాపక వాహనాలు నిలిచి ఉండడంతో.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. దానిని క్లియర్ చేస్తున్నారు. ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. దీంతో భారీగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Updated Date - May 21 , 2026 | 10:50 AM