Share News

సీఎం మనిషినంటూ బెదిరింపులు.. పోలీసుల అదుపులో కేటుగాడు

ABN , Publish Date - May 21 , 2026 | 09:13 AM

సీఎం మనిషిని.. కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ ఖరీదైన కారుల్లో తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాడు సంతోష్ కుమార్ గుప్తా ఆటను మేడ్చల్ పోలీసులు కట్టించారు.

సీఎం మనిషినంటూ బెదిరింపులు.. పోలీసుల అదుపులో కేటుగాడు

మేడ్చల్, మే21: సీఎం మనిషిని.. కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ ఖరీదైన కారుల్లో తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాడు సంతోష్ కుమార్ గుప్తా ఆటను మేడ్చల్ పోలీసులు కట్టించారు. ముఖ్యమంత్రి, మంత్రుల పేర్లు చెప్పి వివిధ రంగాలకు చెందిన వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. భారీగా నగదు వసూళ్లకు పాల్పడుతున్నాడు. దీంతో పోలీసులకు సంతోష్ కుమార్ గుప్తాపై ఫిర్యాదు అందింది. దాంతో అతడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.


హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లోని భూ వివాదాలు, విద్యా సంస్థల నుంచి అతడు భారీగా నగదు వసూళ్లు చేశాడు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లొసుగులను లక్ష్యంగా చేసుకుని ఆర్టీఐ (RTI) చట్టం పేరుతో రియల్టర్లను బ్లాక్‌ మెయిల్ చేసేవాడు. విలాసవంతమైన హోటళ్లను వేదికగా చేసుకుని అతడు పలు రకాల సెటిల్‌మెంట్లు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది.


అయితే మునీరాబాద్‌లోని 'ఆరో రియాల్టీ' సంస్థ యాజమాన్యాన్ని సంతోష్‌కుమార్ గుప్తా బెదిరించాడు. ఈ సంస్థ నిర్వాహకులను భయపెట్టి రూ.6 కోట్ల విలువైన 5 విల్లాలు లేదా రూ.25 కోట్లు ఇవ్వాలంటూ సంతోష్ కుమార్ డిమాండ్ చేశాడు. దీంతో మేడ్చల్ పోలీసులను వారు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో వారికి సంతోష్ కుమార్ చిక్కాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐపీఎల్ టికెట్లు కొనుగోలు చేస్తున్నారా?.. టీజీసీఎస్‌బీ కీలక సూచన

పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు..

For More TG News And Telugu News

Updated Date - May 21 , 2026 | 09:32 AM